Saturday, June 12, 2010

నే ధన్యనైతి నే జగత్ప్రభో , సాధులోకవిభో

కాంభోజి -- ఆదితాళము
పల్లవి - నే ధన్యనైతి నే జగత్ప్రభో , సాధులోకవిభో II

అనుపల్లవి - మాధవ చరణారవింద, మకరందముఁగ్రోల గల్గెనే IIధన్యII

మునుమిడి సంశయమనే ముడి వీడె నీ యనుగ్రహ
మున రామతత్త్వము సంక్షేప, ముగ వింటి కడదేరగంటి
మనసు తనివి తీరదాయె -  మన్నింపవే దైవరాయ,
అనువుంద నినుజేర మాయ యతిదూరమై తొలగిపోయెనే IIధన్యII 1

అద్వితీయాఖండ పరిపూర్ణానంద వారిధిలోన
చిద్విలా సోల్లాసి వై రం, జిల్ల జేసి నన్ను డాసి
హృద్వికాస మొనరించి, హిత వాక్యము లుపదేశించుటచే
విద్వన్నుత శంకర వి, శ్వేశ శంభో మహదేవన్నే IIధన్యII 2

స్వామీ నే నీచే విన్న యీ చరితము రసభరితము,
వేమాఱు దీని వినఁ బల్కుఁ వీను లమృతము జిల్కు
శ్రీమహిళాభి రాముడై శేషాద్రి ధాముడైన శ్రీ
రాముని దేవతాసార్వభౌముని నీ వలన దెలిసినే IIధన్యII 3

No comments:

Post a Comment