Thursday, September 5, 2013

వినవే పల్లవమృదుచరణా కరుణా, వితరణగుణాభరణా

ఆనంద భైరవి రాగము    ఆటతాళము

పల్లవి: వినవే పల్లవమృదుచరణా కరుణా, వితరణగుణాభరణా

అనుపల్లవి : జనవిభు డానతి, చ్చిన దండకాటవికి- 
                  మునివేషధారివై చనియెద నన విని, 
                  యనఘ రాఘవ కాముకుడనై యతివ వ
                  లనను జిక్కితిని నిను వనమునకు ననిచి ప్రాణము లీ 
                  తనువునను మన వనెను భూపతి II వినవేII

రామా జగదభిరామా సుబాహుని రామా కుల ల
లామా హా హైమవతీచింత్య, నామ హా భీమోద్దాము సం
గ్రామ హా శ్రీమహిత ముఖజిత, సోమా నిన్ను
నేమని పొమ్మందు, నెటుల యోర్చియుందు
యీ మోహాబ్ధికి గట్టు, యేదని విలపింప,
నా మహిపతి నడలవలదని సౌమిత్రితో దల్లి నగరికి
స్వామి చని నతి సుమిత్రా కౌ సల్యలకు సేయ దీవించిరి IIవినవేII

అనువంద వనభూమికరుగ గార్యము వ
చ్చె, నమ్మా సెలవిమ్మా యనిన
విని సొమ్మసిల్లి యా కొమ్మ హా,
వనజాక్ష ననుజేర రమ్మా రాజు
నిను బొమ్మనుట నిజమ్మానమ్మా
నన నగుచు  కైక, తన నందనుని దొరనుగా
నను పదునాల్గేండ్లు, వనమున వసియింప
జనవిభుని వేడె బితృవాక్యమును,
మనుప జనియెద నన భరతుని క
వని యొసంగి తనయు నిచటనె నిలు,
మనుచు, గౌసల్య విలపించెను IIవినవేII

కైక యెవ్వరు ధరణి, కాంతు డెవరు చూడు నా త
ఢాకా పరాకా కైక నీకై కడిగి దివిజా, నీకములు
ఢీకొనిన ద్రుంతు పో, నీక రాజ్యశ్రీకిని  పట్టాభి
షేకమిపుడు ప్రాకటముగ జేతు భరతు డల్గిన  నతని
గేకయుల త్రుళ్ళడ, గింతునని లక్ష్మణుడు
వీకమై బల్కరాముడు విని నీ కడిమియును నీదు భక్తియు
లోకముల కెల్ల దెలియును వ, త్సా కైకపై యలుగవలదనె IIవినవేII

జడము నస్వరము యీ, జగము రాజ్యము తనువు, సత్యమా యిది నిత్యమా ఆస,
పడ భోగ ఫల, మౌన్నత్యమా, కలిమి
పడతి చంచల సుతనస్తుత్యమా భ్రాంతి
యుడుగకుండుట స, త్కృత్యమా మాన
వుండ సుఖమునకు కర్మ,
మొడిగట్టి తనకంటె నొడలు వేఱని తెలియ,
నడుగు కోర్కెలు తృణతతి
నడియేటగూడి యదసిన క్రియ, మాతృ పితృ సతి సుతాదుల
నడక యిది స్వప్న సమ మనియె, న్నక
జడుడు కోరుననె రాముడు IIవినవేII

ఆయువల్పము జరావ్యాధులు పులుల వలె ,
డాయ దెలియడాయ నరుడు
ఈ యఖిల సుఖములు, హేయమనడు,
మాయురే భగవన్మాయ దే
హా యాత్మయను కుమతి ఛాయమాత్ర,
మై యస్థిత్వ జ్వేదో మజ్జా సృజ్ఞ్మాంస ని,
కాయ మౌకాయ మె, ట్లాయనాత్మ చెపుమా
యీ యాస విడుపు మహమిక భ్రమ హేతు విదియ యవిద్య నే నన,
ఫాయమగు సచ్చిదానంద, బ్రహ్మ మునుటిదివిద్యయనె హరి  IIవినవేII

మొదలు క్రోధము పాప, మునకు మనస్తాప మూలము
ఇంద్రజాలము క్రోధము- సనయాత్ములకు ప్రతికూలము
క్రోధము హృదయగ్రంధికి నాలవాలము క్రోధము
విదిత ధర్మములకు , శూలము, మదియం
దది యుంచకను నిను నీ, వఖిలసాక్షిగా నెంచి
ముదమున సుఖియింపుము యీ జ్ఞానము
మదయుతులకే వలదు లక్ష్మణ, మర్మయని తల్లి కీ తత్త్వమె
సదయుడై తెలుప గౌగిట సుతు, గదియించి పోయి రమ్మనె సతి IIవినవేII

హరి సుమిత్రకు మ్రొక్కి యన్న లక్ష్మణ నిలువుమన్న మనసువెన్న
కరణి కరుగ బల్కె నీకన్నమున్న నే
నరిగెద నను రానీ, కున్న జత్తు
పరమేశ యనిన గడు జెన్నా, రంగ
కరుణించి యనుజు రాకకు సమ్మతించి యా
ధరణిజను జేరి నే దండకాటవికేగి,
తిరిగి వచ్చెద నిలువుమన నీ.
చరణములయాన నే నిలునిను
బరమాత్మ యనిన శేషాచల, పతి యతివతో గూడి కదలెను IIవినవేII

No comments:

Post a Comment