Sunday, September 8, 2013

చికుర నిందితాలీ రణకేళీ జితమదాసురాళీ నిలయీకృత--

యదుతులాంభోజి రాగము           ఆదితాళము
పల్లవి: చికుర నిందితాలీ రణకేళీ జితమదాసురాళీ నిలయీకృత
           సకల భువనపాళీ లలనా, సతిమౌళీ కాళీ IIవినవేII
అనుపల్లవి:
 సకల రాజన్యులు రాజును భా
కులరత్నము విభవము నుడిగి జ
నకసుతా లక్ష్మణ సమేతుడై
వికసితాంబుజలోచనుడై చను
టకు, గతమేనని తండ్రియాజ్ఞ కడ
వికి బోవుటెఱిగి పురజనులు పొగల
నకట వగవకుండనుచు వారితో 
ననియె వాసుదేవు డన్ములింద్రుడు IIచికురII

ఈ రాముడు నారాయణదేవుడు,
ఈశు డవ్యయుడు మహానుభావుడు
శౌరి యోగమాయ సీత అయ్యనుకోరి
శేషుడే లక్ష్మణుడయి యలరె జను
లురా బ్రహ్మవిష్ణురుద్రా కారమై బూని గుణశ్రీ
మీర జగదుదయ స్థితి సం,
హారములు జేయు ఘనుడు హరి
ఈ రాముడు మత్స్య కూర్మ సూకర,
నారసింహ వామన భృగురామ శ
రీరములు దాల్చి యిపుడు ద
శరథ కుమారుడయ్యె ఖలుల జంపుటకు ననె IIచికురII

రావణాది దుర్జనుల వదార్థము
రాము డుద్భవిల్లుట ఈ యర్థము
దేవముని దెలిసి పలుక నతనితో దెల్పె రే
పు వనికేగెదనని యితడు ధర
ణీ వల్లభుడు గైక హరి నట
వీవాసమున కను పలే దిత
డే వారల నిట నియమించెను
దైవాధీనము సర్వజగము
గావున మీ రిందుకయి యడలకు
డీ వనజోదరు హృదయ పద్మమున
భావించిన జింత లెడలునని ము
ని వలుక బౌరు లలరి హరి నుతించిరి IIచికురII

ఆమీదట రాముడు కైక నగరి
 కరిగి యడవికేగ మాకు ముగ్గురి్కి
భూమిపతి యాజ్ఞ కొనుమనిన కైక,
దీమశమున నిచ్చె నారచీరలు,
అవి సౌమిత్రియు రాముడు గట్టిరి,
భూమిసుత ఛీ గాదన్నను,
స్వామి జనకజ కటి జుట్టెను,
ఏమీ యనలేక నృపభార్య,
లీ మానవతికీ చీరె తగద
ని యేడ్వగ వసిష్ఠు డదరిపడి కైక,
నీ మదిచెడ సీత కది యొసగ దగు,
నే యని దుకూలముల కవనిజ కొసగె  IIచికురII

రాజు సుమంత్రునచే గుమారులకు రథము దెప్పించ నపుడె జనకునకు
శ్రీజాని సలక్ష్మణుడై మ్రొక్కెను, సీత యందరికి మ్రొక్కియు రదమెక్కె హరి
జేజే లలరగ తేరెక్కెను, జేజే యని ప్రజలు బొగడ నహి,
తా జేకొని సుమిత్రకొమరుడు
రాజిలు రథమెక్కె సుమంత్రుడు రథ, రథ్యముల నడుప నిలుమని దశరథ
రాజు విలపింప దరిమి నడచి జన
రాజితోడ దమస దాటె రాముడు IIచికురII

పుడమి ఱే డవనిపై బడి పుర,
పుర బొక్కిపొరలియేడ్వ భృత్యు లధిపుని
యడలి కౌసల్య నగరికి గొని చని రా యువతి విభుని బోదింపుచు నుండె న,
క్కడ రాముడు నిల్చి జనుల నిటు,
విడరారని పురికి రథము గొని
నడురాతిరి సుమంత్రు బొమ్మని
యుడు రాజని భావనయును నను
జుడు గూడి నడువ నపుడె కదలి చని, సుమ, హ త్త రంగ కలి కలుష భంగ
మృడ జటాజూట సంగ గంగ గని మెచ్చు శౌరిజేర గుహుడు వచ్చెను. IIచికురII

చరణకమలయుగళికి బ్రణమిల్లెడు
 యెఱకువాని రాముడు సుధ జల్లెడు
గురుదయాదృష్టి  గని కౌగిట నిడు
కొన్న బొగ గుహుడు భక్తి చ్యుతుని
హరి ధరియించె జటలు మునినై వని
జరియింతు ననుచు లక్ష్మణుడును
ధరియించెను సత్యవ్రతుడని
కురియించిరి విరులు సురలు శ్రీ్
ధరుడు గంగ నీట గ్రుంగి జలములు
ద్రావి తరుమూలమున బవ్వళించె
దరుణి తోడ నట రామచంద్రు నా
గరులు గాన లేక పురికి బోయిరి  IIచికురII

మాయామానుష వేషధారి తృణశా
యియై నిదురవోవగ దను
స్సాయకములు బూని గొలి
చియుండెను సౌమిత్రితో నిషాదవిభుడు పలికె దృడ
శాయి శ్రీహరి నిటుగని కను
దోయి సంతోషింపకున్న
దోయి ఈ దుఃఖమునకు కయి
కేయి హేతువుగదా యనెను
మాయిక ముసుఖాసుఖము నొడలు తమ
కేయెడలేదని లక్ష్మణుడు శబర
నాయకునకు దెల్పగ నరుణోదయ
మాయె శేషగిరిపతియు మేల్కొనెను. IIచికురII 









No comments:

Post a Comment