Friday, September 13, 2013

సఖీమణి వినవే నీవీ సచ్చరితము సలలితానం, దదాయక, మనవే

6. భూపాలము        ఆదితాళము
పల్లవి:
సఖీమణి వినవే నీవీ సచ్చరితము సలలితానం, దదాయక, మనవే
అనుపల్లవి:

సుఖా అడశుభసుషుప్తిదేరి
ముఖ్యాబ్జశాంతి పొదల రఘుకుల 
శిఖామణి గుహ సీతానుజుల్
సేవింప స్నాతుడై సుప్రీతుడై లస
దఖండమగు యోడనెక్కి యమ
రాపగగడచి గుహుని బిలిచి 
నఖాపురికి బొమ్మనుచు బనిచె
సదయుడై ప్రయత్నపూర్వకముగ IIసఖీII

మించి రాఘవులు మృగమునొకటి, వ
ధించి వచనము మంచిగా గా
వించి ముగురు భుజించి యచట వ
సించి మేల్ కాంచి, మరునా
డంచితగతి ధర్మాత్మజ తాను
దంచద్భరద్వాజాశ్రమము
గాంచి మునికి తమ
వేంచేయు టెఱిగించ రాబంచి హ
ర్షించి రమ్ముని శిష్యుచే నృప
పంచాననులు వచ్చుట దెలిసి;
చంచదర్ఘ్యము, గొంచెడురు చని,చక్రి వీ
క్షించి తనువు పులకించ నుతి
యించ ముని కనఘులు నమస్క
రించ కౌగలించి రాముని పూ
జించెను శ్రీరాముని స్మితముఖజితసోముని జగదభిరాముని IIసఖీII

నాదబిందుకళాతీత జగ
దాదిపురుష మహాత్మ విను నీ
పాదరజమున బ్రోదిచేయుము
నాదుమందిరము అనిన ముని
నాదరించి తదాశ్రమమున వి
నోదించి తదనుజ్ఞ సుజ నా
హ్లాది వాల్మీకాశ్రమము శ్రుతి
నాద బంధురముగని ముని
పాదములకు నవనిజానుజుల
తో దవిలి ప్రణతుడై యలరు మ
హా దేవుని సుమాస్త్రరుచిరుని న
బ్జ దళనేత్రు రమాకళత్రుని శ్రిత
మేదినీసుతా లక్ష్మణులా వాల్మీకు గాంచి గారవించి పా
ద్యాది విధుల నర్చించి ఫలములర్పించి భజించి హరి పలికె. IIసఖీII

స్వామి విను వనభూమి దశరథ
భూమి విభు పనుపున జరింపగ
మేము వచ్చుట మీకు దెలియని
దేమి యున్నది నేను యీ మానవతి
తో మెలగి యిచట శ్రీమించునది
నేమింపుమని రాముడు పలుక
నా మౌని యఖిలార్థ సద వేదయై
ప్రేమచే బల్క భువనమునకు
రామ నీవే నిలయమని నీకు ధా
మమిది సాధారణమను త్తమమైన దే
వా మహాను భావా విను
మేమహాత్ములతిశాంతులు
సములిచ్ఛాసూయా విరహితులు నీ
శేముషిగల వారిమది నీకు శ్రీయు
తముగ నిలనునికి యనెను. IIసఖీII

శమదమదయాసత్యములు గల
సుమతు లెవ్వరు శుభాశుభముల
సమయముల హర్ష విషాదముల
భ్రమయరెవ్వరు సుజనబృం
దముల గూడి ధర్మ ధర్మసమ
రమున వీడి మది నిను శర
ణము వేడి గర్వము దిగనాడి
మమత గోరాడి యెవ
ర మునులయి తనరారుదురు యెవ
రి మితథృతి శ్రీరామ నీమం
త్రము జపింతురు ధ్వంద్వరహితుల యితజ్జనులస్వాం
తము నిశాంతము నీకు షడ్వ
రిమతషడూర్మిషడ్భావముల
కుమీఱి యవల వెలుగు నిను దే
హముగ సర్వగతునిగ నొకగని నరయు జను
ల మది యిలు నీకనె. IIసఖీII

అనవరతయోగా, భ్యాసబలమున దృడీకృత
మనస్కులు విను ప్రతినిముషమును
గనుగొనుచు నఘులయిమించు
ఘనులహృద్వనజమున సీతాయుతుడవయి
మొనసి విహరింప మదియ నీకు
ననువైన ఠావు నిను వర్ణింపజాల, నంచు బలికి
వనజాక్ష నీ ప్రభావముచే ,
ననువంద బ్రహ్మఋషి నయితిని
జనన మాత్రమే క్ష్మామరు
డను నిషాదపురి బెరిగి విలుబట్ట నెఱిగి బో
యనెలత నొకతెనెనసి కొడుకుల
గని నే వారి ప్రోవ జీవుల
మునుమిడి యమునివలెనే జంపుచు ముచ్చుల ఱే
డన నెగడితి ననె. IIసఖీII

ఈ గతి చరియింప సప్త ఋషు
లాగమ వేత్తలరుగ వారల
సాగి పోనీకాపననిరి
వేగ నీవరిగి నీ సుతుల
నీ గరితలను నెమ్మి బిలిచి
భోగ ఫలములపోల్కి దురితము
భాగములు గొమ్మని వారి
నాగరిక మెఱిగి రామా
తో గర్వమెందుకన జని నే
నాగరిత నడుగ నాలుబిడ్డలు
మూగి యడవిచిన మొఱకునయి మరలి
యోగివరులను గని యిది దెలుప విని కడు
రాగిలి యుపదేశమిచ్చి వారలలజనను రామరామ యన వి
రాగి నై జపించితి పుట్టలు, ప్రబలె నాదు తనువునననె ముని IIసుఖీII

అంతట బహుసహస్రాబ్దములు
పంతమునను దపంబు సేయగ
దాంతులగు సప్తఋషులు వచ్చి
దనర నను దెలుప బానుడు
మంతుమీఱ దమమునడంచు క్రియ
వింతగా వల్మీకము వెడలి
సంతసమునను సంయములగని, సద్భక్తిసలు ధీ
మంతుడవు బ్రహ్మఋషి వైతివి
వంత దీఱెను వాల్మీకి యని
యంతర్హితులై
రింతయును శేషాద్రీశ నిను మది
నుతియించు ఫలమిదియని
కొంతబొగడి సురనదికి చిత్ర
కూటగిరికి నడుమ గృహము ముని
కాంతుడు రచింప సీతా, లక్ష్మణ
యుతుడై హరియుండె నచట. IIసుఖీII  





















No comments:

Post a Comment